‘దేవర’ మూవీ సక్సెస్ తర్వాత ఎన్టిఆర్ రీసెంట్‌గా ‘వార్-2’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. ఈ సినిమా తర్వాత ఎన్టిఆర్, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో (NTR Neel) సినిమా చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారో తెలిసిపోయింది.
‘డ్రాగన్’ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుందని చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని నిర్మాత ఎన్వీ ప్రసాద్ ధ్రువీకరించారు. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న మరో సినిమా ‘మదరాసి’ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘మదరాసీ’లో రుక్మిణీ వసంత్‌ను ఎంపిక చేసినప్పుడు ఆమె అప్‌కమింగ్ హీరోయిన్. ఇప్పుడు ‘కాంతార-2’లో, జూ.ఎన్టిఆర్ సినిమాలో (NTR Neel), ‘టాక్సిక్’లోనూ తానే హీరోయిన్’ అని అన్నారు. దీంతో ఎన్టిఆర్, నీల్ సినిమాలో రుక్మిణీనే హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు నిర్ధారణ జరిగింది. దీంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Also Read : ‘ఘాటి’లో అనుష్క విశ్వరూపం చూపించాం