Saturday, April 20, 2024

ఉక్రెయిన్ ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

Russia aims to invade Ukraine

సరిహద్దుల్లో రష్యా, నాటో మిత్రపక్షాల
దళాల పరస్పరం మోహరింపు
దౌత్యవేత్తలు, పౌరులు ఉక్రెయిన్ వీడి రావాలని అమెరికా పిలుపు
అనుకూల నేతను పీఠమెక్కించేందుకు రష్యా కుట్ర : బ్రిటన్
ఐరోపా, అమెరికా దేశాల ఆరోపణలు తోసిపుచ్చిన మాస్కో

ఉక్రెయిన్ : పొరుగుదేశం ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా లక్ష మందికిపైగా సైనికులను మోహరించడంతో పాటు యుద్ధ ట్యాంకులను కూడా తరలించినట్లు ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఐరోపా దేశాలు, అమెరికా, దాని మిత్ర పక్షాలు రష్యాపై గుర్రుగా ఉన్నాయి. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునే దిశగా రష్యా పావులు కదుపుతోందని ఆయా దేశాలు మండిపడుతున్నాయి. అయితే వీటన్నింటిని రష్యా తోసిపుచ్చుతూ వస్తోంది. నాటో కూటమిలో ఉక్రెయిన్‌ను చేర్చుకోరాదని రష్యా డిమాండ్ చేస్తోంది. పశ్చిమ ఐరోపా నుంచి అమెరికాతో పాటు దాని మిత్రపక్షాల బలగాలు వైదొలగాలని మాస్కో వాదిస్తోంది.

రెండు పక్షాల నడుమ చర్చలు సాగుతుండగానే అమెరికా సోమవారంనాడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లోని తమ దేశ దౌత్యవేత్తలు, వారి కుటుంబాలను తిరిగి వచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాతో ముప్పుపొంచిం ఉందని, ఒకవేళ రష్యా చొరబాటుకు పాల్పడితే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయని సూచించింది. అదే పరిస్థితి అమెరికా పౌరులను అనుక్నున సమయంలో తరలించడం సులువైన పనికాదని ఆదేశాల్లో పేర్కొంది. అమెరికా పౌరులు కూడా ఎంత వీలైతే అంత త్వరగా ఉక్రెయిన్‌ను వీడాలని సూచించింది. ఉక్రెయిన్‌లో సుమారు 15వేల మంది అమెరికన్లు ఉన్నట్లు సమాచారం.

అనుకూల నేత కోసం రష్యా కుట్రలు…

మరోవైపు తమ అనుకూల నేతను ఉక్రెయిన్ అధినేతగా చేసేందుకు రష్యా కుట్రలు పన్నుతోందని బ్రిటన్ ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ మాజీ ఎంపి యెవెహెన్ మురయేవ్‌ను రష్యా ఎంచుకొని ప్రోత్సహిస్తోందని యుకె విదేశీ వ్యవహరాలు, కామన్వెల్త్ కార్యాలయం శనివారం ప్రకటించింది. ఈ మేరకు తమకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, ఇలాంటి ప్రయత్నాలకు రష్యా భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని హెచ్చరించింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు రష్యా కుట్రలు పన్నుతున్నట్లు వెలుగులోకి వచ్చిందని యూకే విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రస్ చెప్పారు. రష్యా వెనక్కు తగ్గాలని, ఇలాంటి కుట్రలు మానుకొని ప్రజాస్వామ్య మార్గం అవలంభించాలని కోరారు. ఉక్రెయిన్‌పై రష్యా ఎలాంటి మిలటరీ చర్యలు చేపట్టినా తాము, తమ మిత్ర దేశాలు ఊరుకోమన్నారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ స్వాధీనం చేసకునే ఉద్దేశంతో రష్యా సరిహద్దులోకి లక్షమంది సైనికులను తరలించిందన్న వార్తలు వచ్చాయి. అయితే బ్రిటన్ ఆరోపణలను రష్యా ఖండించింది. బ్రిటన్ ఆధ్వర్యంలో నాటో కూటమి సాగించే తప్పుడు ప్రచారంలో ఇదంతా భాగమని రష్యా విదేశాంగ శాఖ ఆరోపించింది.

నాటో అదనపు బలగాలు సిద్ధం…

మరోవైపు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు నాటో ప్రకటించింది. స్టాండ్‌బై గా మరిన్ని బలగాలు, ఆయుధాలను సిద్ధంగా పెట్టుక్నునట్లు తెలిపింది. అవసరమైతే ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యాకు దీటుగా స్పందించేందుకు నౌకలు, యద్ధ విమానాలను సిద్ధం చేసినట్లు వెల్లడించింది. మిత్ర దేశాలు నాటోకు మరిన్ని అదనపు బలగాలను సమకూర్చాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పశ్చిమ మిలిటరీ కూటమి సెక్రెటరీ జనరల్ జెన్స్ టోల్టెన్‌బెర్గ్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News