Monday, April 29, 2024

మార్చి17న రష్యా అధ్యక్ష ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశంపై తన పట్టును మరో ఆరేళ్ల పాటు కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. రష్యా అధ్యక్ష పదవికి 2024 మార్చి 17న ఎన్నికలలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనకు ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ గురువారం ఏకగ్రీంగా ఆమోదం తెలిపింది. దీంతో అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమయినట్లేనని స్పీకర్ వలెంటినా మట్వియెంకో ప్రకటించారు. ఇప్పటివరకు నాలుగు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయన 7 ఏళ్ల పుతిన్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఎన్నికల తేదీ ఖరారయినందున పుతిన్ మరోసారి ఆయన బరిలో ఉంటారని భావిస్తున్నారు.ఆరేళ్ల ఆయన పదవీ కాలం 2024లో ముగియాల్సి ఉంది. కానీ పుతిన్ తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణల ప్రకారం 2024 తర్వాత మరో రెండు పర్యాయాలు అంటే 2036 వరకు అధికారంలో కొనసాగే వీలుంది.

రాజకీయ అధికార యంత్రాంగంపై పూర్తి పట్టు ఉన్న పుతిన్ మార్చిలో జరిగే ఎన్నికల్లో మరో విడత ఎన్నిక ఎన్నిక కావడం తథ్యమని భావిస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థులని భావిస్తున్న వారంతా జైళ్లలోనో, విదేశాల్లోనో ఉండి పోయారు. అందువల్ల ఒక వేళ ఎవరైనా పోటీ పడినా అది నామమాత్రంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌తో ఏడాదికి పైగా జరుగుతున్న యుద్ధం, ప్రైవేటు సైన్యాధిపతి యువ్‌గెనీ ప్రిజోవ్ విఫల తిరుగుబాటు వంటివి పుతిన్ ప్రజాదరణపై పెద్దగా ప్రభావం చూపుతున్న దాఖలాలు ఏవీ లేవని పరిశీలకులు అంటున్నారు. రష్యాలో పుతిన్ పాలన అయిదుగురు అమెరికా అధ్యక్షులు బిల్‌క్లింటన్‌నుంచి జో బైడెన్ దాకా విస్తరించింది.1998లో అప్పటి రష్యా అధ్యక్షుడు బొరిస్ ఎల్సిన్ హటాత్తుగా రాజీనామా చేయడంతో ఆయన తాత్కలిక అధ్యక్షుడయ్యారు. 2000 మార్చిలో ఆయన తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2008లో ఆయన పదవీకాలం ముగియడంతో అధ్యక్ష పదవినుంచి తప్పుకోవలసి వచ్చింది.

అప్పుడు ఆయన ప్రధానమంత్రి పదవికి మారగా, ఆయనకు అత్యంత సన్నిహితుడయిన దిమిత్రీ మెద్వెదేవ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. పేరుకు మెద్వేదేవ్ అధ్యక్షుడయినా అధికారమంతాపుతిన్ చేతుల్లోనే ఉండేది. 2012లో మరో సారి అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు పుతిన్ ప్రకటించినప్పుడు మెద్వెదేవ్ అధ్యక్ష పదవినుంచి తప్పుకుని ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి అంగీకరించారు. అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినా పుతిన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడాన్ని అవేవీ అడ్డుకోలేక పోయాయి.ఆ తర్వాత రెండు సార్లు రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా 80 ఏళ్లు దాటే వరకు కూడా తానే అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గాన్ని సుగమం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News