Tuesday, December 10, 2024

ఉక్రెయిన్ పవర్‌గ్రిడ్‌పై రష్యా దాడి

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనేక ప్రాంతాలపై ఆదివారం రష్యా భారీగా దాడులు చేసింది. పవర్‌గ్రిడ్‌ను లక్షంగా చేసుకొని క్షిపణులను ప్రయోగించింది. ఆగస్టు నుంచి ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద దాడి ఇదే. ఈ దాడిలో గ్రిడ్ తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. “గత మూడు నెలల్లో ఇంధన మౌలిక సదుపాయాలపై రష్యా దాడి చేయడం ఇది ఎనిమిదోసారి అని, విద్యుత్తు సరఫరా, ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయి” అని ఉక్రెయిన్ ఎనర్జీ మంత్రి గెర్మన్ వెల్లడించారు. వాయు రక్షణ వ్యవస్థలు 16 క్షిపణుల్లో 12, మొత్తం 13 డ్రోన్‌లను రాత్రిపూట అనేక ప్రాంతాలపై ప్రయోగించాయని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. సెంట్రల్ జపోరిజ్జియా ప్రాంతంలో ఇద్దరు ఇంధన కార్మికులు గాయపడ్డారు.

పశ్చిమనగరం ఎల్వివ్‌లో పరికరాలు దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు. కీవ్ సహా పలు జిల్లాలు, నగరాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్‌లలో శీతాకాలం అత్యంత కఠినంగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఇళ్లలో వేడికోసం విద్యుత్తు, గ్యాస్ వంటి వాటిని వినియోగిస్తారు. ఈ సీజన్‌లో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్‌ను ధ్వంసం చేయడానికి యత్నించడం గమనార్హం. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఇక్కడ వేల మంది ప్రాణాలు తీయగలవు. రష్యా తాజాగా భారీ దాడి చేయడంతో సరిహద్దుల్లోని పోలాండ్ పూర్తిగా అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా వాయుసేనను సిద్ధం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News