ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా, సమరోత్సాహంతో సౌతాఫ్రికా
నేటి నుంచి లార్డ్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ పోరు
లండన్: ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్లూటిసి) ఫైనల్ సమరానికి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీమ్‌లు సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి చారిత్రక లార్డ్ మైదానంలో తుది పోరు జరుగనుంది. 202325 సంవత్సరానికిగాను తొలి రెం డు స్థానాల్లో నిలిచిన ఇరు జట్లు ఫైనల్‌కు అర్హత సా ధించాయి. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొ దవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. సౌతాఫ్రికాతో పోల్చితే ఆస్ట్రేలియా కాస్త బలంగా కనిపిస్తోంది.
కానీ సఫారీ టీమ్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ సౌతాఫ్రికా అసాధారణ ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఈ క్రమంలో టీమిండి యా, ఇంగ్లండ్ వంటి బలమైన జట్లను వెనక్కినెట్టి తుది పోరుకు చేరుకుంది. ఫైనల్లో కూడా మెరుగైన ప్రదర్శన చేయాలనే లక్షంతో ఉంది. ఆస్ట్రేలియా కూడా ట్రోఫీని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. రెండు జట్లు కూడా విజయమే లక్షంగా పెట్టుకోవడంతో ఫైనల్ సమరం ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
జోరుమీదున్న మార్‌క్రమ్
సౌతాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్‌క్రమ్ అద్భుత ఫా మ్‌లో ఉన్నాడు. ఇది జట్టుకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. రికెల్టన్‌తో కలిసి శుభారంభం అందించాలనే పట్టుదలతోమార్‌క్రమ్ ఉన్నాడు. ఐపిఎల్‌లో ఇ టు మార్‌క్రమ్ అటు రికెల్టన్ నిలకడైన బ్యాటింగ్‌తో అలరించారు. కీలకమైన డబ్లూటిసి ఫైనల్లో కూడా రాణించాలనే లక్షంతో కనిపిస్తున్నారు. కెప్టెన్ తెంబ బవుమా రూపంలో మరో పదునైన బ్యాటింగ్ అస్త్రం సఫారీ టీమ్‌కు అందుబాటులో ఉంది. ఎ లాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా బవు మా సొంతం. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్ బవుమాపై నెలకొంది.
అంతేగాక వి యాన్ ముల్డర్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, వికెట్ కీపర్ కైల్ వెర్రిన్నెలతో సౌతాఫ్రికా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. మార్కొ జాన్సన్, కేశవ్ మ హారాజ్ వంటి మ్యాచ్ విన్నర్ ఆల్‌రౌండర్లు కూడా జట్టులో ఉన్నారు. ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లు కగిసొ రబడా, లుంగి ఎంగిడిలు కూడా జట్టుకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న సౌతాఫ్రికా భారీ ఆశలతో ఫైనల్‌కు సిద్ధమైంది.
ఫేవరెట్‌గా కంగారూలు..
మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఫైన ల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌ లింగ్ విభాగాల్లో జట్టు చాలా పటిష్ఠంగా కనిపిస్తోం ది. ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కారే వంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. ఓపెనర్లు ఖ్వాజా, హె డ్‌లు శుభారంభం అందించాలని భావిస్తున్నారు.
లబుషేన్, స్మిత్, గ్రీన్‌లతో బ్యాటింగ్ చాలా బలం గా ఉంది. అంతేగాక హాజిల్‌వుడ్, లియాన్, స్టార్క్, కెప్టెన్ కమిన్స్ వంటి అగ్రశ్రేణి బౌలర్లు జట్టులో ఉ న్న సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియాకు ఫైనల్లో గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.
జట్లు వివరాలు
సౌతాఫ్రికా: ఐడెన్ మార్‌క్రమ్, రియాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, తెంబ బవుమా (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రిన్నె (వికెట్ కీపర్), మార్కొ జాన్సన్, కేశవ్ మహారాజ్, కగిసొ రబడా, లుంగి ఎంగిడి.
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖ్వాజా, లబుషేన్, కామెరూ న్ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బియు వెబ్‌స్టర్, అలెక్స్ కారే(వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిఛెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్.