Saturday, December 14, 2024

ఫార్మా సిటీపై ప్రభుత్వానికే స్పష్టత లేదు: సబితా ఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైరయ్యారు. ఫార్మా సిటీపై ప్రభుత్వానికే స్పష్టత లేదని సబితా విమర్శలు చేశారు. ఈ మేరకు బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపైన జరిగిన దాడి బాధాకరమన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

అయితే.. ఈ దాడి బిఆర్ఎస్ చేయించిందని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే బిఆర్ఎస్ సైలెంట్ అవుతుంది అనుకుంటున్నారని..తాము అరెస్టులకు భయపడమని.. ప్రజా గొంతుకగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే అధికారులపైన రైతులు ఆక్రోశం చూపించారని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News