Thursday, September 18, 2025

వరుస సినిమాలతో బిజీ బిజీగా సాయిపల్లవి

- Advertisement -
- Advertisement -

సాయి పల్లవి గత ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. పూర్తిగా రెస్ట్ తీసుకొంది. కానీ ఈ ఏడాది మాత్రం ఆమె పూర్తిగా బిజీ అయింది. విరాట పర్వం విడుదల తర్వాత బ్రేక్ తీసుకున్న ఆమె గత ఏడాది చివరలో కొత్త సినిమాలు సైన్ చెయ్యడం మొదలు పెట్టింది. ప్రస్తుతం మూడు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. అన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి. అందుకే ఆమె ఊపిరి సలపనంత బిజీగా ఉంది.

తెలుగులో ఆమె నాగ చైతన్య సరసన తండేల్ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలే విశాఖ పట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశారు. ఇంకా చాలా భాగం మిగిలే ఉంది. డిసెంబర్‌లో విడుదలయ్యే తండేల్ కోసం ఆమె కష్టపడుతోంది. ఇక బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ రెండో చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఇప్పుడు రణబీర్ కపూర్ సరసన రామాయణలో సీతగా నటిస్తోంది. ఈ రెండు హిందీ సినిమాలు కూడా వచ్చే ఈఏడాది విడుదల అవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News