Tuesday, October 15, 2024

‘స్పిరిట్’ కోసం బాలీవుడ్ స్టార్ కపుల్స్?

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘యానిమల్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ‘ది రాజాసాబ్’ చేస్తున్నాడు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ కూడా ప్రారంభించాడు. ఇక సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ‘స్పిరిట్’ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్‌లో ఉన్నారు. ఈ సినిమాలో కీలక పాత్రల కోసం స్టార్ యాక్టర్స్‌ని సందీప్ రెడ్డి వంగా ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కి ప్రతినాయకుడిగా ఎవరు కనిపించబోతున్నారు అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది.

‘స్పిరిట్’ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తాడట. పవర్‌ఫుల్ మాఫియా డాన్‌గా వయోలెంట్ క్యారెక్టర్‌లో ప్రభాస్ కనిపిస్తాడట. ‘స్పిరిట్’ చిత్రంలో విలన్స్‌గా బాలీవుడ్ స్టార్ కపుల్స్ ని ఎంపిక చేయాలని సందీప్ రెడ్డి వంగా అనుకుంటున్నాడట. దీనికోసం బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్, అతని భార్య కరీనా కపూర్ ని ‘స్పిరిట్’ సినిమా కోసం సంప్రదించారని తెలిసింది. ‘స్పిరిట్’ సినిమాలో వారిద్దరి కోసం అనుకుంటున్న క్యారెక్టర్స్ ను దర్శకుడు పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని సమాచారం. ఇక ఈ ఏడాది చివరలో పూర్తి నటీనటులను ఫైనల్ చేసి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News