Friday, March 29, 2024

హైకోర్టును ఆశ్రయించనున్న సమత కేసు దోషులు?

- Advertisement -
- Advertisement -

Samata Case

 

హైదరాబాద్ : సమత కేసులో ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ ముగ్గురు దోషులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు న్యాయవాదులతో దోషుల కుటుంబ సభ్యులు ఆదివారం నాడు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రత్యేక కోర్టు విధించిన రూ.26వేల జరిమానా దోషుల కుటుంబ సభ్యులు చెల్లించారు. సమతపై గ్యాంగ్ రేప్, హత్య కేసులో నిందితులకు ఆదిలాబాద్ పాస్ట్ ట్రాక్ కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 24న కుమరం భీమ్ జిల్లా ఎల్లాపటార్ సమీపంలో ముగ్గురు దుండుగలు సమతను రోడ్డు పక్కన పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో 66 రోజుల్లోనే ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చి వారికి ఉరిశిక్ష విధించిన విషయం విదితమే.

 

Samata Case convicts go to High Court
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News