Sunday, September 15, 2024

నూతన శ్రేణి ఏసీలను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్ ఇండియా

- Advertisement -
- Advertisement -

భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, తన తాజా ఆవిష్కరణ – చిల్డ్ వాటర్ ఇండోర్ కేటగిరీలో కొత్త విండ్-ఫ్రీ ఎయిర్ కండిషనర్‌లను ఆవిష్కరిస్తున్న ట్లు ప్రకటించింది. ఈ కొత్త శ్రేణిలో విండ్-ఫ్రీ, 360o బ్లేడ్‌లెస్ టెక్నాలజీని చిల్డ్ వాటర్ ఆధారిత క్యాసెట్ యూనిట్ల లో కలిగి ఉంది. ఇది వినియోగదారులకు డైరెక్ట్ కోల్డ్ డ్రాఫ్ట్ (నేరుగా వచ్చే శీతల ప్రవాహాలు) అసౌకర్యం లేకుండా అత్యుత్తమ కూలింగ్ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది.

చిల్డ్ వాటర్ ఆధారిత క్యాసెట్ యూనిట్లు వినియోగదారులకు కావలసిన ఉష్ణోగ్రతను సెట్ చేయడానికి వీలు క ల్పిస్తాయి. విండ్‌ఫ్రీ కూలింగ్ సాంకేతికత 0.15మీ/సెకను గాలి వేగంతో 15,000 మైక్రో-ఎయిర్ హోల్స్ వరకు చ ల్లని గాలిని సున్నితంగా వెదజల్లుతుంది. అదనంగా, అధునాతన ఎయిర్‌ఫ్లో సిస్టమ్ నిశ్శబ్దంగా పని చేసేట ప్పుడు గదులను వేగంగా చల్లబరుస్తుంది. అత్యల్ప స్థాయిలో ఇది 24 dB(A) ధ్వనిని మాత్రమే ఉత్పత్తి చే స్తుంది. ఇది ఒక గుసగుసలా ఉంటుంది. ఇది దీన్ని పడకగదులు, స్టడీ రూమ్, బేబీ రూమ్‌లకు అనువైంది గా చేస్తుంది.

కొత్త ఫ్యాన్ కాయిల్ యూనిట్ విండ్‌ఫ్రీ ఏసీలు వాటర్ పైపులు, అనుబంధ వాల్వ్‌ లను ఉపయోగించి సెంట్రల్ చిల్డ్ వాటర్ సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడ్డాయి. ఈ హైడ్రానిక్ ఫ్యాన్ కాయిల్ యూనిట్లు పెద్ద ప్రదేశాలను వేడి చే యడానికి లేదా చల్లబరచడానికి కాయిల్స్ ద్వారా వేడి లేదా చల్లటి నీటిని ప్రసరింపజేస్తాయి. ఈ యూనిట్లను సామ్‌సంగ్ ఎయిర్-కూల్డ్ చిల్లర్స్ లేదా ఏదైనా థర్డ్-పార్టీ ఎయిర్-కూల్డ్, వాటర్-కూల్డ్ చిల్లర్‌లతో ఉపయోగిం చవచ్చు.

ఈ సందర్భంగా సామ్‌సంగ్ ఇండియా ఎస్ఏసీ బిజినెస్ సీనియర్ డైరెక్టర్ శ్రీ విపిన్ అగర్వాల్ మాట్లాడుతూ, “సామ్‌ సంగ్ లో మా అత్యాధునిక ఉత్పాదనల ద్వారా తుది వినియోగదారులకు సౌలభ్యం, మన్నికను అందించడమే మా లక్ష్యం. చిల్డ్ వాటర్ ఫ్యాన్ కాయిల్ యూనిట్లు నిశ్శబ్దంగా పనిచేస్తున్నప్పుడు వేగవంతమైన వేగంతో ఉన్నతమైన చల్లదనాన్ని అందిస్తాయి. కూలింగ్ యూనిట్లు పెద్ద ప్రదేశాలకు అత్యంత సముచితమైనవి. ఎయిర్‌ఫ్లో సిస్టమ్‌లను మరింత అధునాతనంగా చేస్తూ అందరికీ అందుబాటులోకి వచ్చేందుకే మా ప్రయత్నం” అని అన్నారు.

అందుబాటులో మూడు రకాల సామ్‌సంగ్ చిల్డ్ వాటర్ ఫ్యాన్ కాయిల్ యూనిట్లు

· 1 వే క్యాసెట్ (2.6KW~ 4.2KW): ఆటో స్వింగ్ ఫీచర్‌తో పెద్ద ప్రాంతాల ను త్వరగా, సమర్ధ వంతంగా చల్లబరిచేలా రూపొందించబడింది. దీని పెద్ద బ్లేడ్ చాలా పెద్ద, విశాలమైన ప్రదేశంలోకి గాలిని పంపుతుంది. ఆటో స్వింగ్ ప్రతి దిశలో గాలిని పంపిణీ చేస్తుంది. 1వే క్యాసెట్‌లు అందంగా ఉండే చాలా స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఇది కేవలం 135 మి.మీ ఎత్తును కలిగి, కేవలం 155 మి.మీ చిన్న సీలింగ్ స్థలానికి సరి పోతుంది. అందువల్ల, ఇది ఖాళీ స్థలం పరిమితంగా ఉన్న విస్తృత శ్రేణి ప్రదేశాలను చల్లబరచడానికి, వేడి చేయడానికి తగిన, సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. అంతేగాకుండా, దీని సొగసైన, కాంపాక్ట్ డిజైన్ అన్ని రకాల, శైలులకు చెందిన ఇంటీరియర్స్ లో చక్కగా కలసి పోతుంది.

· 4 వే క్యాసెట్ (6.0KW~10.0KW): పెద్ద బ్లేడ్ డిజైన్‌తో అత్యుత్తమ శీతలీకరణ పనితీరును అందిస్తుంది. ఎంచుకున్న ప్రదేశాలకు గాలిని నిర్దేశిస్తుంది, గాలిని చెదరగొట్టకుండా చేస్తుంది.

·360o చిల్డ్ వాటర్ క్యాసెట్ (6.0KW~10.0KW): ఆధునిక ఆర్కిటెక్చరల్ ఇంటీరియర్స్ కు అనుగుణంగా ఉండేలా వినూత్న వృత్తాకార డిజైన్‌ను కలిగి ఉంటుంది. కోల్డ్ డ్రాఫ్ట్స్ (శీతల ప్రవాహాలు) లేకుండా అన్ని దిశల్లో గాలిని ఒకే విధంగా వెదజల్లుతుంది. గాలి ప్రవాహాన్ని నిరోధించే బ్లేడ్‌లు ఉండవు, ఇది 25 శాతం వరకు ఎక్కువ గాలిని బయటకు పంపుతుంది మరియు దానిని మరింత విస్తరిస్తుంది.

ధర, లభ్యత

సామ్‌సంగ్ చిల్డ్ వాటర్ ఫ్యాన్ కాయిల్ యూనిట్ల 3 రకాలు భారతదేశంలోని రిజిస్టర్డ్ ఆఫ్‌లైన్ భాగస్వాముల తో కూడిన సామ్‌సంగ్ నెట్‌వర్క్ నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇవి అతి తక్కువ సామర్థ్యం గల యూనిట్ కి సంబంధించి రూ.35000 నుండి ప్రారంభమవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News