- Advertisement -
వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ సామ్‌సంగ్ ఇండియా తన అనుబంధ సంస్థ న్యూరోలాజికా ద్వారా అత్యాధునిక మొబైల్ సిటీ (సిటి) స్కానర్ల పోర్ట్‌ఫోలియోను విడుదల చేసింది. ఈ కొత్త టెక్నాలజీతో ఇకపై రోగిని స్కానింగ్ గదికి తరలించాల్సిన అవసరం లేకుండా, ఐసియు, ఆపరేటింగ్ రూమ్ వంటి ప్రదేశాలలో రోగి వద్దకే స్కానర్‌ను తీసుకువచ్చి తక్షణమే ఇమేజింగ్ చేయవచ్చు. ఎఐ -సహాయంతో పనిచేసే ఈ పరికరాలు సురక్షితమైన, వేగవంతమైన ఫలితాలను అందిస్తాయి. టైర్-2/3 నగరాల్లోనూ ఉన్నతస్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చి, దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని సామ్‌సంగ్ పేర్కొంది.
- Advertisement -