Wednesday, June 4, 2025

శభాష్ సర్ఫరాజ్.. అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు..!

- Advertisement -
- Advertisement -

టీం ఇండియాలో చోటు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు.. యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్. ప్రస్తుతం సర్ఫరాజ్ (Sarfaraz Khan) ఇంగ్లండ్‌లో జరుగుతున్న అనధికార టెస్ట్ సిరీస్‌లో భారత్-ఎ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కరుణ్ నైర్ డబుల్ సెంచరీ, సర్ఫరాజ్ 92, దృవ్ జురేల్ 94 పరుగులు చేయడంతో 557 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు టామ్ హైన్స్ అండగా నిలిచాడు. భారీ స్కోర్‌ను అధిగమించేందుకు తన వంతు కృషి చేశాడు. టామ్ హైన్స్ ఈ క్రమంలో సెంచరీ సాధించాడు. మరోవైసేు మాక్స్ హోడ్లెన్, డాన్ మోస్లే కూడా సెంచరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.

అయితే టామ్ హైన్స్‌ దూకుడు చూస్తే.. అతను భారీ స్కోర్‌ని సాధించేలా అనిపించింది. అతని దూకుడుకి శార్దూల్ ఠాకూర్, సర్ఫరాజ్‌ ఖాన్‌లు (Sarfaraz Khan) బ్రేక్ వేశారు. శార్ధూల్ వేసిన పుల్లర్ డెలివరిని ఆఫ్‌ సైడ్ డ్రైవ్ ఆడటానికి హైన్స్ ప్రయత్నించాడు. కానీ, అది బ్యాటింగ్ అంచుకు తగిలి.. మొదటి స్లిప్‌ వైపు దూసుకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఎడమవైపు దూకి క్యాచ్‌ని ఒడిసిపట్టాడు. దీంతో భారత్‌కు పెద్ద ఉపశమనం లభించింది. ఈ క్యాచ్ ద్వారా సర్ఫరాజ్ తన ఫిట్‌నెస్‌ని శంకించిన అందరికి గట్టి సమాధానం ఇచ్చాడు. ఇక మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ లయన్స్ 7 వికెట్ల నష్టానికి 527 పరుగులు చేసి 30 పరుగుల వెనుకంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News