- Advertisement -
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. గురువారం జరిగిన పోరులో ఈ జోడీ చైనాకు చెందిన వాంగ్ చాంగ్, లియాంగ్ వీ కెంగ్ చేతిలో పరాజయం పాలైంది. 44 నిమిషాల పాటు జరిగిన పోటీలో సాత్విక్ జంట ఐదో సీడ్ వాంగ్ జోడీ చేతిలో పోరాడి ఓడింది. హోరాహోరీగా సాగిన పోరులో భారత జంట 2224, 1421తో ఓటమి చవిచూసింది.
- Advertisement -