Thursday, October 10, 2024

ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా

- Advertisement -
- Advertisement -

హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో ఈనెల 28న గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. ఈ నేపధ్యంలో హీరో కార్తి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “డైరెక్టర్ ప్రేమ్ కుమార్ స్క్రిప్ట్‌ని ఒక అద్భుతమైన నవలగా రాశారు. మొత్తం చదివాను. చాలా చోట్ల ఆనందంలో కన్నీళ్ళు వచ్చాయి. ఇలాంటి కథ ఎలా రాస్తారని అనిపించింది. నాకు కె.విశ్వనాధ్ సినిమాలు ఇష్టం. కానీ ఇప్పుడు అలాంటి కథలు రావడం లేదు.

ఈ కథ చదివినప్పుడు అలాంటి ఒక మంచి సినిమా అవుతుందనిపించింది. చాలా అరుదైన స్క్రిప్ట్. తప్పకుండా ఈ సినిమా చేయాలనిపించింది. -బ్రదర్స్ లాంటి రెండు క్యారెక్టర్స్ మధ్య నడిచే కథ ఇది. ప్రతి ఒక్కరూ చూడాలనుకునే సినిమా. అరవింద్ స్వామి ఇందులో క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్. 96 సినిమాలానే ఇది ఒక్క నైట్‌లో జరిగే కథ. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కొత్త అనుభూతినిస్తుంది. సాగర సంగమం సినిమా చూసినప్పుడు ఎలాంటి ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుందో సత్యం సుందరంలో కూడా లాంటి ఓ మంచి అనుభూతిని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు.

విశ్వనాథ్ సినిమాలు కమర్షియల్ బ్లాక్‌బస్టర్సే. ఇది కూడా అలాంటి సినిమానే. ఊపిరి సినిమా చూసినప్పుడు చాలా బ్యూటీఫుల్ ఎమోషన్ ఉంటుంది కదా.. అలాంటి హ్యాపీ ఎమోషన్ ఉన్న కథ ఇది. ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా చూస్తే ఎంతో ఆస్వాదిస్తారు. -సూర్య నా మొదటి సినిమా చూసి నన్ను కౌగిలించుకున్నారు. మళ్ళీ ఈ సినిమా చూసి చాలా గర్వంగా కౌగిలించుకున్నారు. అద్భుతంగా నటించావని కాంప్లిమెంట్ ఇచ్చారు. ప్రస్తుతం సర్దార్ 2 సినిమా జరుగుతోంది. వా వాతియారే అనే సినిమా వుంది. ఖైదీ 2 సినిమా వచ్చే ఏడాది ఉండొచ్చు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News