Friday, May 3, 2024

కొమురం భీం స్వస్థలం స్మారకాన్ని అభివృద్ధి చేశాం: సత్యవతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ పేరిట హైదరాబాద్‌లో భవనం నిర్మించామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. స్వల్పకాలిక చర్చకు మంత్రి సత్యవతి రాథోడ్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌లో కొమురంభీం పేరిట ఆదివాసుల భవనం నిర్మించామని, కొమురం భీం స్వస్థలం స్మారకాన్ని అభివృద్ధి చేశామని, ఎస్‌టి రిజర్వేషన్లు పది శాతానికి తెలంగాణ ప్రభుత్వం పెంచిందని, ఎస్‌టి రిజర్వేషన్ల పెంపును కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని సత్యవతి మండిపడ్డారు. గిరిజన విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు రూ.20 లక్షలు సాయం చేస్తున్నామని, గిరిజన వికాస పథకానికి నిధులు ఇస్తున్నామన్నారు. పోడు భూములతో పాటు అడవులను కాపాడుకోవటం ఎంతో ముఖ్యమని రాథోడ్ వివరించారు. గిరిజనులకు పోడు పట్టాలిచ్చామని చెప్పారు.

Also Read: పాముతో ప్రేమలో పడిన ఆవు (వీడియో వైరల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News