Monday, April 29, 2024

ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎంఎల్ఎ లకు సుప్రీంలో ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. అనర్హత వేటుకు గురైన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలలో పాల్గొనడానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతి నిరాకరించింది. అయితే కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై అసెంబ్లీ స్పీకర్‌కు ధర్మాసనం నోటీసు జారీచేసింది. ప్రధాన రిట్ పిటిషన్‌తోపాటు స్టే

దరఖాస్తుపై స్పీకర్‌కు నోటీసు జారీచేసి మే 6న మొదలయ్యే వారంలో వీటిని లిస్టింగ్ చేయాలని జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. నాలుగు వారాలలో తమ నోటీసుకు సమాధానం ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించిన ధర్మాసనం ప్రతిస్పందన తెలియచేసేందుకు పిటిషనర్లకు ఒక వారం వ్యవధి ఇచ్చింది. ఆ ఆరు స్థానాలలో మళ్లీ ఎన్నికలు నిర్వహించే విషయమై తాము నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. అసెంబ్లీ కార్యకలాపాలలో పాల్గొనడానికి కాని, ఓటింగ్ చేయడానికి కాని తాము అనుమతించబోమని అనర్హత వేటుకు గురైన ఆరుగురు ఎమ్మెల్యేలకు ధర్మాసనం స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News