Thursday, December 7, 2023

పాఠశాల బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల:  జడ్చర్ల 167వ జాతీయ రహదారిలో పాఠశాల బస్సు బోల్తా పడి పలువురు విద్యార్థులకు గాయాలైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం జడ్చర్ల మండల పరిధిలోని కొత్తతాండ సమీపంలో ఉన్న మౌంట్ బాసిల్ పాఠశాలకు చెందిన ఏడవ నంబర్ బస్సు టిఎస్ 06 యూఏ 0363 విద్యార్థులతో స్కూల్‌కు వెళ్తుండగా వెనక నుండి లారీ నంబర్ టిఎస్ 07 యూకే 3799 ఢీ కొట్టడంతో పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 28 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. పాఠశాల యాజమాన్యం స్పందించి విద్యార్థులను ఎస్వీఎస్ ఆసుపత్రికి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News