Sunday, March 26, 2023

బాలుడి ప్రాణం తీసిన ఈత సరదా..

- Advertisement -

గోవిందరావుపేటః  ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  గోవిందరావుపేట మండలం చల్వాయి సమీపంలోని గుంటలో తోటి విద్యార్థులతో కలిసి శనివారం ఈతకు వెళ్ళారు. చెరువులు ఈతకు దిగారు. నీళ్లలో కొద్దిదూరం వెళ్ళగానే ఈత రాకపోవడంతో అల్లం రిషిక్ నీళ్లలో మునిగాడు. తోటి విద్యార్థులు ఇద్దరు చెరువు ఒడ్డున ఉండి చూస్తుండగానే అరుపులు చేస్తూ మునిగిపోయాడు.

మిగతా ఇద్దరు ఏడుస్తూ స్కూల్‌కు వెళ్ళారు.విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు విలపిస్తూ బాలుడి మరణానికి స్కూల్ ఉపాధ్యాయులే కారణమని, వారి నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు మరణించాడని స్కూల్ ఎదుట ధర్నా చేశారు.స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News