Thursday, September 18, 2025

సిఎం కెసిఆర్ బస్సులో తనిఖీలు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. సిఎం కెసిఆర్ తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతూ ప్రచారం చేపడుతున్నారు. కరీంనగర్ జిల్లా మానకోండూరులో ప్రజా ఆశీర్వాద సభ ఉండడంతో అక్కడికి కెసిఆర్ వెళ్లాల్సి ఉంది. సిఎం కెసిఆర్ తన బస్సులో మానకోండూరు వెళ్తుండగా గుండ్లపల్లి టోల్‌గేట్ వద్ద కేంద్ర బలగాలు కెసిఆర్ బస్సును తనిఖీ చేశారు. దీనికి సిఎం కెసిఆర్ పూర్తిగా సహకరించారు. సిఎం కెసిఆర్ ఇవాళ మానకోండూరు, స్టేషన్‌ఘన్‌పూర్, నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా అశీర్వాద సభలకు హాజరుకానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News