Saturday, August 16, 2025

సరోగసి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్‌ జిల్లాలో సరోగసి కేసులో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. సరోగసి మహిళలతో నిందితురాలు బాండ్లు రాయించుకున్నారు. తనిఖీల్లో భారీగా ప్రామిసరీ నోట్లు, బాండ్లు బయటపడ్డాయి. పెద్ద ఎత్తున హార్మోన్‌ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐవిఎఫ్‌ సెంటర్‌కు వెళ్లిన దంపతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిందితురాలు లక్ష్మి ఏజెంట్ల ద్వారా సేకరిస్తున్నారు. లక్ష్మి నివాసంతో పాటు హెగ్డే ఆస్పత్రి, పలు ఫెర్టిలిటీ సెంటర్ల రిపోర్టులు గుర్తించారు. ఐవిఎఫ్‌ సెంటర్లతో లక్ష్మికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. లక్ష్మి మహిళలను ప్రలోభపెట్టి సరోగసికి ఒప్పిస్తున్నారు. రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు మహిళలతో బేరం కుదుర్చుకున్నట్టు పోలీసులు గుర్తించారు. సరోగసి కోసం వచ్చిన దంపతుల దగ్గర రూ.25 లక్షల వరకు లక్ష్మి వసూలు చేస్తున్నారు. పిల్లల విక్రయాల కేసులో గతంలో లక్ష్మిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు.  8 మంది మహిళలకు ఇప్పటికే పోలీసుల నోటీసులు ఇచ్చారు. నిందితురాలు లక్ష్మి, కుమారుడు నరేందర్‌ పోలీసులు రిమాండ్‌లో ఉన్నారు.

డాక్టర్ విద్యుల్లత పేరుతో అనుమతులు తీసుకుని యూనివర్సల్ సృష్టి పేరుతో ఐవిఎఫ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో డాక్టర్ నమ్రత, డాక్టర్ విద్యుల్లత కలిసి ఐవిఎఫ్ కోసం వచ్చిన దంపతులకు సరోగసికి వెళ్లలని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. రాజస్థాన్ కు చెందిన దంపతులను సరోగసి పేరుతో వేరే వారి బాలుడిని తీసుకుని వచ్చి ఇవ్వడంతో వారు డిఎన్‌ఎ టెస్ట్ చేయించగా వారి కుమారుడు కాన్న తేలింది. దీంతో బాధితులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విచారణ చేసిన పోలీసులు నిందితులను వరుసగా అరెస్టు చేస్తున్నవిషయం తెలిసిందే. నిందితులు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు ముందుగానే లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసిన విషయం విధితమే. డాక్టర్ నమ్రత పిల్లలను కిడ్నాపింగ్ చేసే గుజరాత్‌కు చెందిన డోక్ల గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లు బయటపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News