Friday, September 13, 2024

ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్ గా ముగిశాయి. నేడు తీవ్ర ఒడుదొడుకుల మధ్య చివరకు మిశ్రమంగా ముగిశాయి. మొదట్లో కాస్త ఊపుతో మొదలైన సెన్సెక్స్ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. విచిత్రమేమిటంటే మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 12.16 పాయింట్లు లేక 0.01 శాతం నష్టంతో 80424.68 వద్ద ముగిస్తే, నిఫ్టీ మాత్రం 31.50 పాయింట్లు లేక 0.13 శాతం లాభంతో 24572.65 వద్ద ముగిసింది.  నిఫ్టీ 50లో హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, బిపిసిఎల్, టాటాస్టీల్, ఎల్ టిఐఎం లాభల్లో ముగియగా, ఎం అండ్ ఎం, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బిఐ లైఫ్ నష్టాల్లో ముగిశాయి. డాలరుతో రూపాయి విలువ 0.10 పైసలు లేక 0.12 శాతం పడిపోయి రూ. 83.86 వద్ద ట్రేడయింది. 24 క్యారెట్ల(99.9 శాతం)  10 గ్రాముల బంగారం ధర రూ. 53.00 లేక 0.07 శాతం పెరిగి రూ. 71,428.00 వద్ద ట్రేడయింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News