Thursday, March 23, 2023

స్టాక్ మార్కెట్ క్రాష్!

ప్రీబడ్జెట్ బ్లడ్‌బాత్!
మదుపరుల రూ. 12 లక్షల కోట్లు ఆవిరి!!
- Advertisement -

ముంబై: అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు నేడు మదుపరులను ముంచేశాయి. షేర్ల విలువలను కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలకు పాల్పడ్డారని అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ హిండేన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక కారణంగా అదానీ షేర్లు పతనమయ్యాయి. అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్ అండ్ సెజ్, అదానీ పవర్, అదానీ విల్‌మార్ షేర్లు నష్టాల్ని చవిచూశాయి. అదానీ షేర్లు సెన్సెక్స్‌ను 874 పాయింట్లు దిగేలా చేశాయి. హిండెన్‌బర్గ్‌పై న్యాయపరమైన చర్యలు చేపట్టడానికి ప్రయత్నిస్తామని అదానీ గ్రూప్ ఫీలర్ వదలగా,   తాము అదానీ రికార్డు పుస్తకాలు తనిఖీచేసి నిరూపిస్తామని హిండెన్‌బర్గ్ ప్రతిస్పందించింది. చూద్దాం ఎవరి బలమెంతో….ఈ నేపథ్యంలో ఫియర్ గేజ్ విక్స్ 18 శాతానికి పెరిగింది. దలాల్ స్ట్రీట్ ఇన్వెష్టర్లు మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ. 6.6 లక్షల కోట్లు కోల్పోయారు. ఇప్పుడు బిఎస్‌ఈ లిస్టెడ్ స్టాక్‌ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ 269.9 లక్షలకు పడిపోయింది. బ్యాంకు స్టాకులు కూడా విపరీతంగా నష్టపోయాయి. ముఖ్యంగా ఎస్‌బిఐ 5.06 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.36 శాతం, పిఎన్‌బి 5.40 శాతం,ఐసిఐసిఐ బ్యాంక్ 4.45 శాతం నష్టపోయాయి.

మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 874.16 పాయింట్లు లేక 1.45 శాతం కోల్పోయి 59330.90 వద్ద, నిఫ్టీ 287.60 పాయింట్లు లేక 1.61 శాతం కోల్పోయి 17064.35 వద్ద స్థిరపడ్డాయి. నేడు నిఫ్టీలో టాటామోటార్స్ 6.34శాతం , బజాజ్ ఆటో 5.90 శాతం, డాక్టర్ రెడ్డీస్ 2.69శాతం, ఐటిసి 1.99 శాతం ప్రధానంగా లాభపడగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 18.52 శాతం, అదానీ పోర్ట్ సెజ్ 16.29 శాతం, ఎస్‌బిఐ 5.06 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్ 4.45 శాతం ప్రధానంగా నష్టపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News