Tuesday, April 16, 2024

రెండో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై: భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు వరుసగా రెండో రోజున లాభాల్లో ముగిశాయి. ఐటి, మెటల్, రియాల్టీ, ఫైనాన్షియల్ స్టాక్‌లలో కొనుగోలు కనిపించింది. బ్యాంకింగ్ రంగంలో వస్తున్న సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోడానికి అమెరికాలో బడా బ్యాంకులు చేస్తున్న యోచనలు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలను నింపాయి. కీలక కౌంటర్లలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. నిన్న భారీగా పుంజుకున్న స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్ సూయిజ్ షేరు నేడు తిరిగి నష్టాల్లోకి జారుకుంది. టిసిఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్ గోపినాథన్ రాజీనామా చేయడంతో ఆ కంపెనీ షేరు నేడు తీవ్ర ఒడుదొడుకులకు లోనయింది. చివరికి 0.31 శాతం నష్టపోయి రూ. 3175 వద్ద ముగిసింది.

నేడు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 355.06 పాయింట్లు లేక 0.62 శాతం పెరిగి 57989.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 114.40 పాయింట్లు లేక 0.67 శాతం లాభపడి 17100 వద్ద ముగిసింది. నేడు నిఫ్టీలో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, యుపిఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా ప్రధానంగా లాభపడగా, ఐషెర్ మోటార్స్, ఎన్‌టిపిసి, మారుతి సుజుకీ, ఐటిసి, ఏషియన్ పెయింట్స్ ప్రధానంగా నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసిజి రంగాలు తప్పించి మిగతా అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిశాయి. అమెరికా డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ 0.21 పైసలు పతనమై రూ. 82.54 వద్ద ముగిసింది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 269.00 లేక 0.46 శాతం పెరిగి రూ. 58275.00 వద్ద ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News