తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్‌పై డి మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 17న ఓదెల2 థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత డి మధు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ సినిమాలో తమన్నా అద్భుతంగా నటించారు. ఫస్ట్ లుక్‌తోనే ఆ క్యారెక్టర్ ఎక్కడికో వెళ్లిపోయింది. తమన్నా చాలా హార్డ్ వర్క్ చేశారు. గత ఏడాది ఏప్రిల్, మే ఎండల్లో చెప్పులు లేకుండా షూటింగ్ చేశారు. కాశీలో ఈ సినిమాని లాంచ్ చేశాం.
అలాగే మహా కుంభమేళాలో టీజర్ ని లాంచ్ చేశాం. చాలామంది అది రిస్క్‌తో కూడుకున్న వర్క్ ఏమో అనుకున్నారు. అయితే ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడే సక్సెస్ ఉంటుందని నా అభిప్రాయం. -ఈ సినిమా కథ లాజికల్‌గా ఉంటుంది. ప్రతి దానికి ఒక ఆధారంతోనే చూపించడం జరిగింది. ఇందులో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆడియన్స్ ని చాలా సర్‌ప్రైజ్ చేస్తాయి. -అజినీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. -సౌందర్ రాజన్ అద్భుతమైనటువంటి విజువల్స్ ఇచ్చారు. -ఈ కథలో ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. తమన్నా, వశిష్ట క్యారెక్టర్స్ మధ్య టగ్ అఫ్ వార్‌లా ఉంటుంది. అలాగే మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, హెబ్బా.. ఈ పాత్రలన్నీ కూడా చాలా బాగుంటాయి. ప్రేక్షకులు పాత్రలతో లీనమైపోతారు”అని అన్నారు.