Thursday, September 19, 2024

లాభాల్లో ముగిసిన నిఫ్టీ, సెన్సెక్స్

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు బెంచ్‌మార్క్ సూచీలైన నిఫ్టీ , సెన్సెక్స్  పాజిటివ్ గా ముగిశాయి. రియాల్టీ, ఫార్మా స్టాకులు మార్కెట్ సెంటిమెంట్ కు ఊతం ఇచ్చాయి. ఈ రెండు రంగాల సూచీలు మార్కెట్ తెరుచుకోగానే  గరిష్ఠాన్ని తాకాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 317.03 పాయింట్లు లేక 0.39 శాతం పెరిగి 82451.64 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 83.90 పాయింట్లు లేక 0.33 శాతం పెరిగి 25235.90 వద్ద ముగిసింది. దాదాపు 2115 షేర్లు పెరుగగా, 1630 షేర్లు పతనమయ్యాయి. 117 షేర్లు మార్పులేకుండా యథాతథంగా ముగిశాయి.

వోలాటిలిటీ గేజ్ గా భావించే ఇండియా విక్స్ 3 శాతం తగ్గి 13.4 వద్ద సెటిల్ అయింది. నిఫ్టీ లో సిప్లా, బజాజ్ ఫైనాన్స్, డివీస్ ల్యాబ్స్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్ సర్వీసెస్ ప్రధానంగా లాభపడగా, టాటా మోటార్స్, రిలయన్స్, టెక్ మహీంద్రా, ఐటిసి, కోల్ ఇండియా ప్రధానంగా నష్టపోయాయి. డాలరు మారకంతో రూపాయి విలువ 0.02 పైసలు లేక 0.02 శాతం పతనమై రూ. 83.86 వద్ద ట్రేడయింది. ఇక బంగారం ధర రూ. 141.00 లేక 0.20 శాతం పతనమై రూ. 72047.00 వద్ద ట్రేడయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News