Tuesday, September 17, 2024

బీహార్ గుడిలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి

- Advertisement -
- Advertisement -

బీహార్ గుడిలో తొక్కిసలాటలో మరో 16 మందికి గాయాలు
బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో ఘటన
మృతుల్లో అధికులు కన్వరియాలు
జెహానాబాద్ : బీహార్ జెహానాబాద్ జిల్లాలో బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో తొక్కిసలాటలో కనీసం ఏడుగురు వ్యక్తులు మరణించినట్లు, మరి 16 మంది గాయపడినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. ‘జెహానాబాద్ బరాబర్ పహాడీ ప్రాంతంలోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో ఆదివారం రాత్రి సుమారు 11.30 గంటలకు తొక్కిసలాట జరిగి ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరి 16 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది కన్వరియాలు’ అని జిల్లా మేజిస్ట్రేట్ (డిఎం) అలంకృత పాండే ‘పిటిఐ’తో చెప్పారు.

‘ఆలయంలో నియుక్తులైన భద్రత సిబ్బంది వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను అందరినీ ముకుందాపూర్, పరిసర ప్రాంతాల్లోని సమీప వైద్య కేంద్రాల్లో చేర్పించారు. పది మందిని ప్రథమ చికిత్స అనంతరండిశ్చార్జి చేయగా, ఏడుగురు ఇంకా చికిత్స పొందుతున్నారు. యాత్రికుల రద్దీ అధికంగా ఉన్నందున జిల్లా పాలన యంత్రాంగం నుంచి, పోలీస్ శాఖ నుంచి సీనియర్ అధికారులను ఆలయంలో మోహరించారు’ అని డిఎం వివరించారు.

‘ఏదో అంశంపై కన్వరియాల మధ్య వివాదం తొక్కిసలాటకు దారి తీసినట్లుగా కనిపిస్తోంది. ఆలయం వెలుపల కన్వరియాల బృందానికి, పూల వర్తకులకు మధ్య తీవ్ర వాగ్వాదం ఈ ఘటనకు దారి తీసి ఉండవచ్చునని స్థానికులు కొందరు సూచించారు. అసలు కారణంపై దర్యాప్తు జరుగుతోంది. ఘటన కారణం నిర్ధారణకు విచారణకు ఆదేశించడమైంది’ అని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News