Friday, March 1, 2024

బాలికపై యువకుడి లైంగికదాడి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడి చేసిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం…బోరబండకు చెందిన సాయి(23) తన ఇంటి సమీపంలో ఉంటున్న బాలిక(9)పై కన్నేశాడు. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కావడంతో పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ఇచ్చారు. దీంతో బాలిక ఇంటి వద్ద ఒంటరిగా ఉండగా తల్లిదండ్రులు పనికి వెళ్లారు.

ఇదే అదునుగా భావించిన నిందితుడు బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే చంపివేస్తానని చెప్పడంతో బాలిక భయపడి ఎవరికీ చెప్పలదు. కాగా బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లి బాలికను ఆరా తీసింది. దీంతో తనపై జరిగిన అత్యాచారం గురించి తల్లి చెప్పింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బోరబండ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News