Monday, November 11, 2024

శబరి సినిమా అద్భుతం… ఒటిటిలోకి వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

శబరి సినిమాలో వెర్సటైల్ యాక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ అద్భుతంగా నటించారు. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించగా అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేశారు.  సన్ నెక్ట్స్ ఒటిటిలో ఈ సినిమాను వీక్షించొచ్చు.

సంజన అనే అమ్మాయిలో పాత్రలో వరలక్ష్మీ నటన బాగుంది. సంజన తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. అరవింద్ పాత్రలో గణేష్ వెంకట్రామన్ నటించాడు. సంజన అరవింద్ ప్రేమించుకుంటారు. తన తల్లిని ఒప్పించి  అరవింద్ ను సంజన ప్రేమ పెళ్లి చేసుకుంటుంది. అతడు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఇద్దరు మధ్య మనస్పర్థలు ఏర్పడుతాయి. ఆమె మానసికంగా కుంగిపోవడంతో  అతడికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటుంది. తన కూతురు రియా( బేబీ నివేక్ష)తో కలిసి వేరొక గ్రామంలో ఉంటుంది. ఆమెకు క్లాస్ మేట్ రాహుల్(శశాంక్) సహాయం చేస్తాడు. సంజనను సూర్య అనే(మైమ్ గోపి ) వ్యక్తి చంపాలని నిర్ణయం తీసుకుంటాడు. సూర్య ఎందుకు చంపాలనుకుంటాడు?, చంపాలనుకున్న ప్రతి సారి రాహుల్ ఆమెను కాపాడుతాడు.

విశ్లేషణ : వరలక్ష్మీతో  దర్శకుడు అనిల్ కాట్జ్  సైకలాజికల్ థ్రిల్లర్ తీయడం అనేది మంచి ఆలోచన. వరలక్ష్మి శరత్ కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో సినిమాకు కలిసి వచ్చింది. ప్రేమ జంట మధ్య సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఆమెకు ఇచ్చిన రోల్ బ్యాక్ స్టోరీకి బాగుంది. ఇంటర్వెల్ నుంచి సినిమా కథ పరుగులు తీస్తూ ఉంటుంది. సెకండాఫ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. వరలక్ష్మీ నటనతో పాటు క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ అందరినీ కట్టి పడేస్తుంది. ఈ చిత్రానికి గోపి సుందర్ అందించిన సంగీత ప్లస్ పాయింట్ గా చేప్పుకోవచ్చు. రెండు పాటలు వచ్చినప్పుడు ప్రేక్షకులు కళ్లప్పగించి చూస్తారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. ఈ చిత్ర నిర్మాణంలో మహేంద్రనాథ్ ఎక్కడ కూడా వెనుకంజ వేయలేదు. సినిమాటో గ్రాఫర్లు రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టిలు పడిన కష్టం సినిమాలో కనిపిస్తుంది. విలన్ పాత్రలో మైమ్ గోపి ఎంట్రీ సీన్ సూపర్ గా ఉంటుంది. తన ఇంట్లోనే ఒకరిని చంపేసిన సీన్ తో పాటు రోడ్డు ప్రమాదాన్ని కూడా బాగా చిత్రీకరించారు.

నటీనటుల విషయానికి వస్తే.. సంజన పాత్రలో వరలక్ష్మీ ఒదిగిపోయింది. ఆమె చేసిన సినిమాలలో పాత్రల కంటే ఇప్పుడు చేసిన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంది. భర్త లేకపోవడంతో భార్య ఎలాంటి కష్టాలు పడుతుందనే పాత్రను ఆదర్శంగా తీసుకోవచ్చు.  సినిమా ప్రారంభం కాగానే కమిట్మెంట్ అడిగిన ఓ వ్యక్తికి. ఆమె హెచ్చరించిన సీన్ బాగుంటుంది. వరలక్ష్మీ నుంచి వచ్చే డైలాగులు నేచురల్ గా ఉండడంతో పాటు అద్భుతంగా ఉంటాయి. మైమ్ గోపి తన నటనతో విలన్ పాత్రకు న్యాయం చేశాడు. మిగిలిన నటీనటుల తమ పాత్రలలో ఒదిగిాపోయారు.

చివరి మాట : శబరి సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. సినిమా చాలా బాగుంది ఎక్కడ కూడా బోర్ కొట్టదు.. సన్ నెక్ట్స్ లో వీక్షించొచ్చు.

రేటింగ్ : 4/5.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News