Wednesday, October 9, 2024

రెండో టెస్టుకు షకీబుల్ ఔట్?

- Advertisement -
- Advertisement -

కాన్పూర్ : తొలి టెస్టులో ఓటమి నుంచి కోలుకోకముందే బంగ్లాకు మరో షాక్ తగిలింది. కాన్పూర్‌లో జరిగే రెండో టెస్టులో గెలుపొంది సిరీస్ సమం చేయాలని భావిస్తున్న శాంటో సేనకు గట్టి దెబ్బతగిలింది. ఆ జట్టు ప్రధాన స్పిన్నర్ షకీబుల్ హసన్ రెండో టెస్టులో ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. తొలి టెస్టులో గాయపడిన షకీబుల్ ఇంకా కోలుకోలేదు. దాంతో, షకీబ్‌కు విశ్రాంతినిచ్చే అవకాశముంది.

చెన్నై టెఓస్టులో రెండో ఇన్నింగ్స్‌లో షకీబ్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది. దాంతో, అతడు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు మాత్రమే వేశాడు. గాయం కారణంగా షకీబ్ బ్యాటింగ్‌లోనూ పెద్దగా రాణించలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ బౌలింగ్‌లో షకీబ్ వేలికి బంతి బలంగా తాకింది. అయినా సరే నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News