Saturday, April 27, 2024

`మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను.. ఎమోషన్స్‌తో కూడిన చిత్రం..

- Advertisement -
- Advertisement -

`అక్కడొకడుంటాడు` ఫేమ్ శివ కంఠ‌మ‌నేని హీరోగా న‌టించిన‌ హై ఓల్టేజ్ యాక్ష‌న్ డ్రామా `మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను`. క‌ళ్యాణ్ రామ్ “కత్తి” ఫేమ్ మల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క్యాథ‌లిన్ గౌడ హీరోయిన్‌గా న‌టించ‌గా మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ముప్పా వెంక‌య్య చౌద‌రి సార‌థ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప‌తాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 13న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. ఈ  సంద‌ర్భంగా  సినిమా విశేషాల గురించి హీరో శివ కంఠ‌మ‌నేని మీడియాతో ముచ్చటించారు. ఆ వివ‌రాలు..

`మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను` అనే సినిమా ఎలా మొదలైంది?
– నేను హీరోగా న‌టించిన‌ `అక్కడొకడుంటాడు` చిత్రం బీ, సీ సెంటర్లలో బాగా ఆడింది. ఆ సినిమాలోని ఓ పోస్టర్‌ను ఈ మూవీ డైరెక్టర్ మల్లి గారు చూశారు. తను రాసుకున్న‌ కథకు నేను అయితే  సెట్ అవుతానని అనుకున్నారు. ఇది రెగ్యులర్ హీరోలు చేసే కథ కాదని, నేను అయితే బాగుంటానని నన్ను అప్రోచ్ అయ్యారు.

ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
– `మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను`  సినిమాలో నేను సూరి అనే పాత్రను పోషించాను. సినిమాలో సూరి, బాబ్జీ..దుర్యోధనుడు, కర్ణుడు లాంటి పాత్రలు. బాబ్జీ పొలిటికల్‌గా ఎద‌గ‌డానికి సూరి చేసిన పనులేంటి? ఫ్రెండ్ కోసం సూరి ఎంత దూరం వెళ్తాడు? ఈ మధ్యలో ప్రేమ కథ ఎలా మొదలైంది? అనేవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

ఈ సినిమా ప్రయాణంలో ఎదురైన సవాళ్లు ఏంటి?
– ఈ సినిమా కోసం మెథడ్ యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. సూరి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం అనేది కూడా క‌ష్టమైన ప‌నే.. అలాగే ఈ మూవీ కోసం ఒంగోలు యాసను కూడా ట్రై చేశాం.

‘మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను’ అనే టైటిల్‌కు ఉన్న ప్రాధాన్యం ఏంటి?
– ఇది ఊరికి సంబంధించిన కథ. ‘నా శరీరం ఎప్పుడూ పచ్చగా ఉండదు.. అప్పుడ‌ప్పుడు మనషుల రక్తంతో తడిసి ఎర్రగా అవుతుంది’ అని ఊరు తన కథను చెబుతుంటుంది. ఒక ఊరి ఆత్మ కథలా అనిపిస్తుంది. పూర్తిగా విలేజ్‌లో జరిగే కథ ఇది. గ్రామంలో జరిగే అన్ని రకాల సంఘటనలు, అన్ని ఎమోషన్స్‌ను చూపించాం.

ఈ ప్రాజెక్టులోకి మణిశర్మ గారు ఎలా వచ్చారు?
– మా డైరెక్టర్ మల్లి గారు ఇది వరకు చేసిన సినిమాలకు మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఆ ర్యాపోతోనే మా చిత్రానికి కూడా సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో ఆర్ఆర్ అద్భుతంగా ఉంటుంది. ఇప్ప‌టికే విడుదలైన రెండు పాటల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

హీరోగానే కాకుండా విలన్ పాత్రలు కూడా  చేసే ఆలోచ‌న ఉందా..?
– మంచు లక్ష్మీ గారి `ఆదిపర్వం` సినిమాలో ఒక‌ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నాను. నెగెటివ్ రోల్ ఆఫర్లు బాగానే వస్తున్నాయి. కానీ నా వ్యాపారాలకు కూడా టైం కేటాయించాల్సి ఉంటుంది. అందుకే నేను వాటిని అంగీకరించడం లేదు.

ఈ సినిమాతో ఏమైనా సందేశం ఇవ్వబోతోన్నారా?
– ప్ర‌త్యేకంగా సందేశం అంటూ ఏమీ ఉండదు. పూర్తి కమర్షియల్ సినిమాగానే ఉంటుంది. అయితే ప్రేమ అనేది శరీరానికి సంబంధించింది కాదు. మనసుకు సంబంధించింది అనే లైన్ మాత్రం అంతర్లీనంగా ఉంటుంది.

సెన్సార్ నుంచి ఏమైనా అభ్యంతరాలు వచ్చాయా?
– ఒక రెండు సీన్లు హింసాత్మకంగా ఉన్నాయని ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఆ సీన్లు ఉంటేనే ఇంటెన్సిటీగా ఉంటుందని వాటిని తీసేయడానికి మా దర్శకుడు అంగీకరించలేదు. అందుకే ఏ సర్టిఫికెట్ వచ్చింది.

‘మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను’ సినిమాలో ఏయే అంశాలు హైలెట్ అవుతాయి?
– ఈ చిత్రంలో లొకేషన్లే హైలెట్ అవుతాయి. మేం ఒంగోలు నుంచి యానాం వరకు ఎన్నో ప్రదేశాలు వెతికాం. ఈ సినిమాలో లొకేషన్లు అద్భుతంగా ఉంటాయి. ఆ పాత ఇళ్లు చూస్తే వెనకటి రోజుల్ని గుర్తు చేస్తాయి. కథా పరంగా ఒంగోలు చూపిస్తాం. రాజమండ్రి, మచిలీపట్నంలో షూటింగ్ చేశాం.

డైరెక్టర్‌ మల్లి గారితో పని చేయడం ఎలా అనిపించింది?
–  మల్లి గారు ఈ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. ఎంత చెప్పారో అంతే తీశారు. ఒక్క సీన్, షాట్ కూడా ఎక్స్ ట్రాగా తీయలేదు. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో చిత్రాన్ని ప‌క్కాగా పూర్తి చేశారు.

భ‌విష్య‌త్తులో ఎలాంటి ప్రాజెక్టులు చేయాలని భావిస్తున్నారు?
– కథా బలమున్న‌ చిత్రాలు, నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉండే సినిమాలను చేయాలని అనుకుంటున్నాను. నెక్ట్స్ రాబోయే సినిమాల్లో `మణిశంకర్` చాలా బాగుంటుంది.

హీరోయిన్ క్యాథలిన్ గౌడ ,ఇత‌ర న‌టీన‌టుల గురించి?
– క్యాథలిన్ గౌడ త‌న వ‌య‌సుకు మించిన పాత్ర అయినా చ‌క్క‌గా న‌టించింది. అలాగే భరణి, సత్య, నూకరాజు పాత్రలు బాగా హైలెట్ అవుతాయి. అందరికీ నటనలో చాలా ఎక్స్‌పీరియెన్స్ ఉంది.

మీ తదుపరి చిత్రాలు ఏంటి?
– మణిశంకర్, రాఘవరెడ్డి చిత్రాలు రాబోతున్నాయి. లాయర్, ఫ్యాక్షనిస్ట్ ఇలా ర‌క‌ర‌కాల‌ పాత్రలను పోషిస్తున్నాను. అతి త్వ‌ర‌లో ఆ సినిమాల వివ‌రాలు ప్ర‌క‌టిస్తాను.

ఈ సినిమా ఎన్ని థియేట‌ర్స్‌లో రిలీజ‌వుతోంది?
– ముందు 100-120 థియేట‌ర్స్‌లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం…కాని బీ,సి సెంట‌ర్స్‌లో మేం ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాబ‌ట్టి థియేట‌ర్ల సంఖ్య రెట్టింపు అయ్యే అవ‌కాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News