Tuesday, February 7, 2023

షార్ట్ సర్కూట్‌తో ఇల్లు దగ్ధం

- Advertisement -

దామెర: షార్ట్ సర్కూట్‌ తో ఇల్లు దగ్ధమైన సంఘటన దామెర మండలంలోని వెంకటాపురం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. దామెర మండలంలోలని వెంకటాపురం గ్రామంలో పంచగిరి రవి ఇంట్లో షార్ట్ సర్కూట్‌తో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటనలో దాచుకున్న రూ. 1.50 లక్షల నగదుతో పాటు మూడు క్వింటాళ్ల పత్తి కాలిపోయింది.

ప్రమాదం జరిగిన ఇంటిని స్థానిక సర్పంచ్ పున్నం రజిత సంపత్‌తో తహసీల్దారు రియాజుద్దీన్ పరిశీలించారు. కాగా బాధితుడు పంచగిరి రవి మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తితోపాటు ఇంట్లో డబ్బు, వస్తువులు, సామాగ్రి కాలిపోవడంతో కన్వీరు మున్నీరయ్యారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles