Friday, July 4, 2025

అదరగొట్టిన శుభ్‌మన్

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరును సాధించింది. 310/5 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు తిరిగి బ్యాటింగ్‌ను ప్రారంభించిన భారత్ మరో 264 పరుగులను జోడించి ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్, రవీంద్ర జడేజాలు రెండో రోజు కుదురుగా బ్యాటింగ్ చేశారు. లంచ్‌కు ముందు జడేజా కాస్త దూకుడుగా ఆడాడు. గిల్ అతనికి సహకారం అందించాడు. ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌తో స్కోరును ముందుకు నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన జడేజా 137 బంతుల్లో పది ఫోర్లతో 89 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో జడేజా, గిల్‌లు కలిసి ఆరో వికెట్‌కు 279 బంతుల్లో 203 పరుగులు జోడించారు.

గిల్ జోరు..
లంచ్ తర్వాత శుభ్‌మన్ మరింత జోరును పెంచాడు. అతనికి వాషింగ్టన్ సుందర్ అండగా నిలిచాడు. సుందర్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా గిల్ దూకుడును ప్రదర్శించాడు. తన మార్క్ షాట్లతో అలరించిన గిల్ డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత చెలరేగి ఆడాడు. అతన్ని కట్టడి చేసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్ (42)తో కలిసి ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన గిల్ 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌లతో 269 పరుగులు చేసి ఔటయాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News