Friday, May 3, 2024

హెల్మెట్ ధరించి వాహనాలు నడపండి

- Advertisement -
- Advertisement -

మానవపాడు: మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మానవపాడు మండల ఎస్‌ఐ రాము శుక్రవారం తన పోలీస్ కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రాము మాట్లాడుతూ మండల ప్రజలు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరారు. 18 ఏళ్లు దాటిన వారంతా చట్టపరంగా మోటార్ వెహికల్ లైసెన్సులను తీసుకోవాలన్నారు. పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే తల్లిదండ్రులు శిక్షకు అర్హులు అవుతారని తెలిపారు.

జాతీయ రహదారులపై నిర్లక్ష్యంగా వాహనం నడపడం చేయకూడదని, డ్రైవింగ్ వ్యక్తిగత అనుభవంగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల మరణాలు సంభవించడంతో వేలాది కుటంపబాలు రోడ్డున పడుతున్నాయని, వైకల్యం చెందిన వారి పరిస్థితి దయనీయంగా మారుతోందని తెలిపారు. యుద్దాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రజల రక్షణనే పోలీస్‌ల ధ్యేయం అన్నారు. రోడ్డు భధ్రత నియమాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News