గజ్వేల్: కాలిపోయిన మృతదేహం కనిపించిన సంఘటన సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం బస్వాపూర్ గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బస్వాపూర్ గ్రామ శివారులో కాలిపోయిన మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు అనుమానాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. మృతుడి వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లేపోవడంతో ఎవరు అనేది తెలియడం లేదన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ములుగు మండలంలో సిసి కెమెరాలు ఆధారంగా దర్యాప్తు చేయడంతో పాటు గజ్వేల్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసు వివరాలను సేకరిస్తున్నామన్నారు. ఎవరైనా కనిపించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.
గజ్వేల్ పరిధిలో మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు
- Advertisement -
- Advertisement -
- Advertisement -