Friday, May 10, 2024

పంద్రాగస్టు నాటికి సిద్దిపేటకు రైలు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: పంద్రాగస్టు నాటికి సిద్దిపేటకు రైలు రాబోతుందని రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని నీలకంఠేశ్వర ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ద్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తులో సిద్దిపేట రైల్వే కేంద్రంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతం నాడు ఉద్యమానికి నేడు అభివృద్ది మార్గ దర్శకమన్నారు. ప్రతి రోజు యోగా, ప్రాణాయామం, వాకింగ్ చేస్తే 90 శాతం రోగాలకు దూరంగా ఉండొచ్చన్నారు. ప్రతి ఒక్కరు యోగ ఆలవాటు చేసుకోవాలన్నారు. సిద్దిపేట నియోజక వర్గం విద్య, వైద్య రంగాలలో సంపూర్ణంగా అభివృద్ది సాధించిందని తెలిపారు. సిద్దిపేట పట్టణంలో అండర్ గ్రైండ్ డ్రైనేజి , కమ్యూనిటీ హాల్స్, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మాణం, రోడ్ల విస్తరణ, ఇంటి గ్రేటెడ్ మార్కెట్లు , ఇంటింటికి త్రాగునీరు అందరిని ఆకర్షిస్తున్న కోమటి చెరువు అభివృద్ది చేశామన్నారు.

15 ఏళ్ల శ్రమ ఫలితం ఈ ద్యాన మందిర భవనం, నీల కంఠ సమాజంలో అందరు కలిసి ఉంటారన్నారు. ప్రభుత్వ సహాకారంతో పాటు సమాజ సభ్యుల కృషితో ఆలయాన్ని అభివృద్ది చేసుకున్నారన్నారు. నీలకంఠ సమాజానికి గుర్తింపు తెచ్చింది సిద్దిపేట రాష్ట్రంలోనే ప్రేరణగా నిలిచిందన్నారు. నీలకంఠ సమాజానికి అవసరమైన సేవలు అందించడానికి ఎప్పటికి సిద్దంగా ఉంటానన్నారు. కోమటి చెరువుకు ముడంతల అద్బుతమైన పర్యాటక కేంద్రంగా రంగానాయక చెరువును 100 కోట్ల రూపాయలతో అభివృద్ది చేయబోతున్నామని తెలిపారు. సిద్దిపేట అభివృద్దిని ఓర్వలేక కొంత మంది మాటలు అంటున్నారని తన బలం ,శక్తి సిద్దిపేట ప్రజలే అని అన్నారు.

నిరంతరం ప్రజా సేవ చేయడమే తన ముఖ్య లక్షమన్నారు. సిద్దిపేట చుట్టు అన్ని వైపులా ఫోర్ లైన్ రహదారి తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు. సిద్దిపేటకు కావల్సిన సౌకర్యాలన్ని దశల వారిగా సమకూర్చుకుంటున్నామన్నారు. ఒక విమాన ప్రయాణం సౌకరం మాత్రమే మిగిలి ఉందన్నారు. కాలంతో పని లేకుండా కాళేశ్వరం జలాలతో పంట సాగు జరుగుతుందన్నారు. కంటి వెలుగు వైద్య శిభిరాలను సద్వినియోగం చేసుకొని ఉచితంగా సేవలు పొందాలని సూచించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, ప్రజాప్రతినిధులు , నాయకులు, నీలకంఠ సమాజం ప్రతినిధులు కడవేర్గు నర్సింలు, రాజనర్సు, జంగిటి కనకరాజు, లోక లక్ష్మిరాజం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, మోయిస్, యోగి, సాకి ఆనంద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News