Saturday, July 5, 2025

డిబెంచర్ల ద్వారా రూ. 875 కోట్లు సేకరించనున్న సిగ్నేచర్ గ్లోబల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రియాలిటీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ తమ ఋణాన్ని రీఫైనాన్స్ చేయడానికి , వ్యాపారాన్ని విస్తరించడానికి నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ. 875 కోట్ల వరకు సేకరించాలని ప్రణాళిక చేస్తోంది. సెక్యూర్డ్ లిస్టెడ్ రిడీమబుల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్‌సిడిలు ) ను జారీ చేయడం ద్వారా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతలలో ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన రూ. 875 కోట్లకు మించని మొత్తంలో నిధుల సేకరించటానికి సిగ్నేచర్ గ్లోబల్ బోర్డు ఆమోదించింది, సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ, “నిధులను సేకరించడానికి మేము బోర్డు ఆమోదం తీసుకున్నాము. మేము వాటాదారుల ఆమోదాలను కూడా కోరనున్నాము ” అని అన్నారు. కంపెనీ తమ ప్రస్తుత రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి రూ. 450 కోట్లు ఉపయోగిస్తుందని, మిగిలిన మొత్తాన్ని వ్యాపార వృద్ధికి ఉపయోగిస్తుందని ఆయన అన్నారు. వాటాదారుల ఆమోదానికి లోబడి ఆగస్టు చివరి నాటికి నిధులను సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని అగర్వాల్ చెప్పారు.

ఎన్‌సిడిల జారీకి వాటాదారుల ఆమోదం కోరడం, రుణ పరిమితిని పెంచడం, భద్రతను సృష్టించడానికి పరిమితిని పెంచడం , కంపెనీ యొక్క ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌ను సవరించడం కోసం పోస్టల్ బ్యాలెట్ నోటీసును కూడా బుధవారం నాడు బోర్డు ఆమోదించింది. గురుగ్రామ్‌కు చెందిన సిగ్నేచర్ గ్లోబల్ దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో ఒకటి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, అమ్మకాల బుకింగ్‌ల పరంగా కంపెనీ ఐదవ అతిపెద్ద లిస్టెడ్ రియల్ ఎస్టేట్ సంస్థగా అవతరించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.10,290 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.12,500 కోట్ల ప్రీ-సేల్స్‌ను లక్ష్యంగా చేసుకుంది. సరసమైన గృహ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి సిగ్నేచర్ గ్లోబల్ తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది, కానీ ఇప్పుడు గురుగ్రామ్‌లో అధిక భూమి ధర కారణంగా మధ్య-ఆదాయ, ప్రీమియం విభాగాలపై దృష్టి సారించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News