Tuesday, October 15, 2024

రూ. 320 కోట్ల కాంట్రాక్ట్ ను ఏసిసి ఇండియాకు అందించిన సిగ్నేచర్ గ్లోబల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని రియల్టీ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించిన గురుగ్రామ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్, సిగ్నేచర్ గ్లోబల్, తమ అన్ని టవర్లు, బేస్‌మెంట్లు ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వెంట సెక్టార్ 84, గురుగ్రామ్, హర్యానాలో దాని రెసిడెన్షియల్ గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం భవనాలు కోసం సివిల్, స్ట్రక్చర్, పార్ట్ ఎంఈపి పనుల కోసం ఏసిసి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను నియమించింది.

సెప్టెంబర్ 12, 2024 నాటి ఎల్ఓఐ మొత్తం కాంట్రాక్ట్ విలువ రూ. 320 కోట్లుగా నిర్ణయించింది. పని ప్రారంభించిన తేదీ నుండి 27 నెలలు లో పూర్తి కావలసి ఉంటుంది. పనిని పూర్తిగా అప్పగించటానికి 3 నెలల వరకు అదనపు సమయం ఉంటుంది. సిగ్నేచర్ గ్లోబల్ వైస్ చైర్మన్ లలిత్ అగర్వాల్ మాట్లాడుతూ “మేము పూర్తి చేయబోతున్న అత్యుత్తమ ప్రాజెక్ట్‌లలో ఇది ఒకటి మరియు మా పోర్ట్‌ఫోలియోలో మకుటాయమానంగా ఉంటుంది. ఇది నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉండటం తో పాటుగా ఈ ప్రాంతంలోనే అత్యంత ఎత్తైనది . అరేబియన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ, వారి భారతీయ అనుబంధ సంస్థ ఏసిసి ఇండియా తమ నిరూపితమైన నైపుణ్యాన్ని ప్రాజెక్ట్‌ లో ప్రదర్శిస్తుంది” అని అన్నారు.

ఏసిసి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అని రే మాట్లాడుతూ, “సిగ్నేచర్ గ్లోబల్‌ యొక్క ట్విన్ టవర్స్ DXP ప్రాజెక్ట్ కోసం భాగస్వామ్యం చేసుకోవటం సంతోషంగా వుంది. నిర్దేశించిన సమయ పరిమితిలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము. ముంబైలోని లోధా డెవలపర్స్ యొక్క వరల్డ్ వన్ (84 అంతస్తులు, 285 మీటర్) వంటి మైలురాయి ప్రాజెక్ట్‌లతో ఏసిసి అనుబంధం కలిగి ఉంది. టాటా హౌసింగ్ & కెవెంటర్స్ యొక్క 88 ఈస్ట్ కోల్‌కతా, మరియు ఢిల్లీ+ NCRలో డిఎల్ఎఫ్ కోసం కొనసాగుతున్న ది 42 (62 అంతస్తులు, 255 మీటర్) ప్రాజెక్ట్‌లతో పాటు ఇతర ప్రధాన మెట్రోలలో అనేక ప్రాజెక్టులు వున్నాయి” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News