Wednesday, October 9, 2024

అమృత్ పథకం కేంద్రానిది… ప్రజలను కెటిఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు: మల్లు రవి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆన్‌లైన్‌లో టెండర్లు వేసి అమృత పథకంలో సృజన్ రెడ్డి కాంట్రాక్టు పొందారని కాంగ్రెస్ ఎంపి మల్లు రవి తెలిపారు. అమృత్ పథకం టెండర్ల విషయంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని మల్లు మండిపడ్డారు. అమృత్ పథకంలో అవినీతి జరిగిందని కెటిఆర్ కామెంట్లపై మల్లు రవి రీకౌంటర్ ఇచ్చారు. ముఖ్యమ్రంతి రేవంత్ రెడ్డి సతీమణికి సొంత తమ్ముడు కాదు అని, బాబాయ్ కుమారుడు అవుతాడని వివరణ ఇచ్చారు. సృజన్ రెడ్డి కంపెనీ జాయింట్ వెంచర్‌లో కాంట్రాక్టు పొందారని, అక్కడ అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉన్న టెండర్లలో అతడు ఉంటే రేవంత్ రెడ్డికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని మల్లు రవి ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ పదేళ్లలో చేయలేని పనులను రేవంత్ రెడ్డి పది నెలలో చేశారని ప్రశంసించారు. సిఎం రేవంత్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. బిఆర్‌ఎస్ ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని, కానీ ఇలానే పాలక పక్షంపై బురద జల్లితే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News