Sunday, August 3, 2025

గని ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/రామకృష్ణాపూర్ : మందమర్రి ఏరియా కేకే 5 గనిలో జరిగిన ప్రమాదంలో రామకృష్ణాపూర్ పట్టణం శ్రీనివాస్ నగర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు రాచపల్లి శ్రావణ్ కుమార్ మృతి చెందాడు. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం కేకే 5 గనిలో ఎస్టీల్ యాక్టింగ్‌గా పని చేస్తున్న శ్రావన్ కుమార్ ఎస్డీఎల్ యంత్రం వెనుక భాగం తగలడంతో పక్కనే ఉన్న లాడీస్ మద్యలో ఇరుక్కుపోయాడని తెలిపారు. సమాచారం అందుకున్న గని అధికారులు రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలిచంగా వైద్యులు ప్రథమ చికిత్స అందజేనసి కరీంనగర్ ఆసుపత్రికి రెఫర్ చేయగా మార్గ మద్యంలోనే చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పలు యూనియన్ సంఘాల నాయకులు ఆసుపత్రికి చేరుకొని యాజమాన్యం అనుసరిస్తున్న తీరుపై ద్వజమెత్తారు.

లాభాల ఆర్జనే ద్యేయంగా కార్మికులపై పని భారం మోపుతూ రక్షణ విషయంలో నిర్లక్షంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. శ్రావణ్ మృతికి యాజమాన్యమే బాధ్యత వహించి కుటుంబ సభ్యుల్లో ఒకరికి తక్షణమే ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. మృతుడికి రావాల్సిన బెనిఫిట్స్ త్వరలోనే అందజేస్తామని, ఆయన కుటుంబానికి అండగా నిలుస్తామని అధికారులు హామీ ఇచ్చారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News