- Advertisement -
టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన కామోడి ఎంటర్ టైనర్ ‘#సింగిల్’. ఈ సినిమా సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీవిష్ణు సరసన యంగ్ బ్యూటీస్ కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. వేసవి కానుకగా మేలో విడుదలై మూవీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వులు పూయించింది. కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఓటిటి ఆడియన్స్ కూడా నవ్విస్తూ దూసుకుపోతోంది.
- Advertisement -