Friday, May 30, 2025

‘సీతా పయనం’ పెద్ద హిట్ కావాలి: సుకుమార్

- Advertisement -
- Advertisement -

మల్టీ టాలెంటెడ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘సీతా పయనం’. (Sita payanam) ‘శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించ గా, నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అర్జున్, ధ్రువ సర్జా పవర్‌ఫుల్ పాత్రలు పోషించారు. మేకర్స్ బుధవారం టీజర్‌ని లాంచ్ చేశారు. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ “అర్జున్ తన కూతురు కోసం సినిమా చేస్తున్నప్పుడు ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ జర్నీనే ఒక సినిమా గా తీయవచ్చు.

ఆయన కోసం సీతా పయనం సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ “అర్జున్ ఈ కథ చెప్పినప్పుడే ఈ సినిమా నేను చూసేశాను. అంత బ్యూటిఫుల్ గా చెప్పారు. టీజర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది” అని తెలిపారు. డైరెక్టర్ అర్జున్ సర్జా మాట్లాడుతూ “మా అమ్మాయి కోసం ఈ సినిమాని మొదలు పెట్టాను. జనాలకి ఈ సినిమా నచ్చుతుందని నమ్మకం ఉం ది. తెలుగు ఆడియన్స్ నాకు ఇచ్చిన ప్రేమ అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అంతే అభిమానం మా అమ్మాయి మీద చూపించాలని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో నిరంజన్, హీరోయిన్ ఐశ్వర్య అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, లిరిక్ రైటర్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News