Sunday, December 15, 2024

మోమోస్ కేసులో ఆరుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

నాసి రకం మోమోస్ తయారు చేసి విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన ఆరుగురు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…బీహార్ రాష్ట్రం, కిషన్‌గంజ్ జిల్లాకు చెందిన అల్మాస్ అలియాస్ అర్మాన్, షాజిద్ హుస్సేన్, ఎండి రయిస్, ఎండి షారుఖ్, ఎండి హనీఫ్, ఎండి రజిక్ బతుకు దెరువు కోసం వచ్చి ఖైరతాబాద్‌లోని చింతల్ బస్తీలో ఉంటూ మోమోస్ వ్యాపారం చేస్తున్నారు. నిందితులు నాసిరకం మోమోస్ తయారు చేసి స్ట్రీట్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఖైరతాబాద్ సింగాడకుంటలో ఈ నెల గత నెల 25వ తేదీన ఏర్పాటు చేసిన వెజిటెబుట్ మార్కెట్‌లో విక్రయించారు. వాటిని మార్కెట్‌లో కొనుగోలు చేసి తిన్న 20మందికి తీవ్ర అస్వస్థత కాగా ఓ మహిళ మృతి చెందింది.

బంజారాహిల్స్, సింగాడా బస్తీకి చెందిన రేష్మా బేగం(31) పదిహేనేళ్ల క్రితం వివాహం కాగా ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త వదిలేయడంతో ఐదేళ్ల నుంచి పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. ఈ క్రమంలోనే రేష్మా కూరగాయలు కొనేందుకు మార్కెట్ వెళ్లగా అక్కడి నిందితులు విక్రయిస్తున్న మోమోస్‌ను కొనుగోలు చేసి తిన్నది. ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురిఅయింది. వెంటనే కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. బీహార్‌కు చెందిన ఆరుగురు నిందితులు నాసిరకం పదార్థలతో మోమోస్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిసింది. బాధితురాలు వీరు తయారు చేసి మోమోస్ తినడం వల్లే మృతిచెందినట్లు రిపోర్టు రావడంతో అరెస్టు చేశారు.

ఢిల్లీలో కొనుగోలు…
నిందితులు ఢిల్లీలో నాసిరకం ఆహార పదార్థాలను కొనుగోలు చేసి, ఇక్కడ మోమోస్ తయారు చేస్తున్నట్లు తెలిసింది.
కేవలం రూ.30కే ఆరు మోమోస్ ఇస్తుండటంతో ఎప్పటిలాగే చాలామంది కొనుగోలు చేశారు. సంతలో వీటిని తిన్న వారు ఇంటికి వెళ్లాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో పాటు కొందరు తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడిపోయారు. ఏం జరిగిందో తెలియక తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు, బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. సింగాడికుంట బస్తీకి చెందిన రేష్మాబేగం ఆమె కుమార్తెలు రుష్మా, రఫీయా, కుమారుడు అబ్దుల్ రెహ్మాన్ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెడికల్ షాపు నుంచి మాత్రలు తెచ్చి వేసినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మరుసటి రోజు వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రేష్మా బేగం మృతిచెందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News