Thursday, September 18, 2025

భార్య, పిల్లలను చంపి…. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన ఇద్దరు పిల్లలు, భార్యను హత్య చేసి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని కాడుగోడిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హైదరాబాద్‌కు చెందిన వీరాంజనేయ(31), భార్య హేమావతి(29) దంపతులు తన పిల్లలు మోక్ష మేఘనయనా, శృష్టి సునయనాలతో  శిగహళ్లిలోని సాయి గార్డెన్ ఆపార్ట్‌మెంటులో నివసిస్తున్నారు. వాళ్లు ఉంటున్న ప్లాట్ నుంచి వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బలవంతంగా డోర్లను ఓపెన్ చేశారు. వీరాంజనేయ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించగా భార్య, పిల్లల మృతదేహాలు మరో రూములో ఉన్నాయి. వీరాంజనేయ ముగ్గురిని చంపి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

Also Read: అన్నదాతల ఆత్మబంధువు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News