Tuesday, September 10, 2024

సాఫ్ట్‌వేర్ యువతిపై అత్యాచారం..హోటల్‌ సీజ్

- Advertisement -
- Advertisement -

సాఫ్ట్‌వేర్ యువతిపై అత్యాచారం జరిగిన బొమ్మరిల్లు హోటల్‌ను రాచకొండ పోలీసులు ఆదివారం సీజ్ చేశారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. గత నెల 29వ తేదీన ఇద్దరు యువకులు యువతిపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగం వచ్చిందని స్నేహితుడికి పార్టీ ఇచ్చిన యువతిపై గౌతం రెడ్డి, అతడి స్నేహితుడు కలిసి అత్యాచారం చేశారు. హోటల్‌లో పగలు, రాత్రి తేడా లేకుండా కస్టమర్లకు మద్యం సేవించేందుకు, గదులు ఇస్తున్నారు. ఎలాంటి ధృవ పత్రాలు లేకుండా హోటల్ గదులలో ఉండడానికి అనుమతిస్తూ, చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహించారు.

దీంతో శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్, హోటల్ ప్రాంగణాన్ని (బొమ్మరిల్లు కాంప్లెక్స్) సిపి సుధీర్ బాబు ఆదేశాల మేరకు వనస్థలిపురం ఇన్స్‌స్పెక్టర్ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్‌కు విజ్ఞప్తి చేయడంతో హోటల్‌ను సీజ్ చేశారు. సాధారణ ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించే వారిని, అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వారిని ఉపేక్షించమని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News