Sunday, September 15, 2024

‘సోలో బాయ్’ టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన

- Advertisement -
- Advertisement -

సోలో బాయ్ టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్‌పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పి. నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. జుడా షాండి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సోలో బాయ్ టైటిల్ సాంగ్ ఘనంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పి. నవీన్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో మా హీరో గౌతమ్ కృష్ణ చాలా బాగా నటించాడు.

సాంగ్స్ ఫైట్స్ ఎమోషనల్ సీన్స్ అన్నిటిలోనూ తనదైన శైలితో నటించాడు. సోలో బాయ్ టైటిల్ సాంగ్‌లో డాన్స్ బాగా చేశాడు’ అని అన్నాడు. ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ‘ సోలో బాయ్ సాంగ్ అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ నవీన్ సైలెంట్‌గా మంచి సినిమాను అందించాడు. నా తమ్ముడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. గౌతమ్ ఫ్యూచర్లో కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు’ అని తెలిపారు. హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ ‘టైటిల్ సాంగ్ కాసర్ల శ్యామ్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్ పాట అద్భుతంగా పాడాడు’ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్వేతా అవస్థి, ఆట సందీప్, అనిత చౌదరి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News