Sunday, September 15, 2024

మద్యం మత్తులో కన్నతండ్రిని చంపిన కసాయి కొడుకు

- Advertisement -
- Advertisement -

జులాయిగా తిరుగుతూ మద్యం మత్తులో పడి కన్నతండ్రిని అతి కిరాతకంగా హత్య చేసిన కసాయి కొడుకు సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా, తెలకపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ బి నరేష్ అందించిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గట్టునెల్లికుదురు గ్రామానికి చెందిన బింగి మల్లేష్ చెడువ్యసనాలకు, మద్యానికి బానిసై ఎటువంటి బాధ్యత లేకుండా, ఏ పని చేయకుండా జూలాయిగా తిరుతున్నాడు.

శుక్రవారం రాత్రి తండ్రి బింగి సుల్తాన్.. మద్యం మానాలని బాధ్యతగా పనిచేసుకోవాలని కొడుకును మందలించాడు. కానీ అప్పటికే మద్యం మత్తులో ఉన్న మల్లేష్ మంచంపై నిద్రిస్తున్న తండ్రి బింగి సుల్తాన్ (52)పై అతి కిరాతకంగా గొడ్డలితో ఎదపైన, గొంతుపైన నరికి చంపాడు. మృతుని భార్య బింగి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కన్నతండ్రిని హత్య చేసిన కసాయి కొడుకు బింగి మల్లేష్‌ను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News