Thursday, July 17, 2025

రాజా రఘువంశీ హత్య కేసు..తన ప్రమేయాన్నిఅంగీకరించిన సోనమ్

- Advertisement -
- Advertisement -

మేఘాలయ లో హనీమూన్ సందర్భంగా రాజా రఘువంశీ హత్యలో తన పాత్రను అతడి భార్య సోనమ్ అంగీకరించిందని పోలీసువర్గాలు తెలిపాయి. వీరి వివాహం జరిగి సరిగ్గా నెల్లాళ్ల తర్వాత మేఘాలయ స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ విచారణ సందర్భంగా సోనమ్ తన పాత్రను ఒప్పుకున్నదని, పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసి టేప్ చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. భారత చట్టం ప్రకారం హత్యచేసినట్లు ఆమె పోలీసుల ముందు ఒప్పుకున్నా అది చెల్లదు. అలాంటి ప్రకటనను మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయాలి.ఈ వారం ప్రారంభంలో సోనమ్ ను, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాను అరెస్ట్ చేసిన తర్వాత అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. కుష్వాహా సోనమ్ కుటుంబం వ్యాపారంలో పనిచేశాడు. రాజాతో అమె వివాహానికి ముందు, తర్వాత కూడా ఆమెతో ప్రేమబంధాన్ని కొనసాగించాడనే ఆరోపణలు ఉన్నాయి.

రాజా రఘువంశీ, సోనమ్ వివాహం మే 11న ఇండోర్ లో జరిగింది. పదిరోజుల తర్వాత వారు హనీమూన్ కోసం మేఘాలయకు బయలుదేరారు. మే21న జంట షిల్లాంగ్ చేరి బాలాజీ గెస్ట్ హౌస్ లో బస చేశారు. మే 22న కీటింగ్ రోడ్డు నుంచి స్కూటీ అద్దెకు తీసుకుని చిరపుంజి లోని సోహ్రాకు బయలుదేరి వెళ్లారు. మే 23న నోంగ్రియాట్ గ్రామం సమీపంలో
వారు చివరి సారిగా ట్రెక్కింగ్ చేస్తూ స్థానిక గైడ్ కు కన్పించారు. అదేరోజు నుంచి వారు ఇద్దరూ కనిపించకుండా పోయారు. మే 24న సోహ్రారిమ్ గ్రామంలో రోడ్డు పక్క పడి ఉన్న స్కూటీని కనుగొన్నారు. జూన్ 2న తూర్పు ఖాసీ కొండలలోని ఓ లోయలో రాజా మృతదేహం కన్పించింది. జూన్ 8న సోనమ్ ను ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో కనుగొన్నారు.ఆమె స్థానిక పోలీసుల ఎదుట లొంగిపోయింది. తర్వాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. రఘువంశీ హత్యకేసులో సోనమ్ తో పాటు ఇతర నిందితులను షిల్లాంగ్ లోని సదర్ పోలీసు స్టేషన్ లో మేఘాలయ సిట్ విచారించింది. ఐదుగురు నిందితులను తర్వాత కోర్టుముందు హాజరు పరుస్తారు.

హత్యతో తమప్రమేయం లేదన్న సోనమ్ సోదరుడు

సోనమ్ చేయించిన హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని, సోనమ్ సోదరుడు గోవింద్ తెలిపారు. తన న్యాయవాదులు సోనమ్ కు వ్యతిరేకంగా వాదిస్తారని చెప్పాడు.తాను రఘువంశీ తల్లికి క్షమాపణ చెప్పినట్లు తెలిపారు. సోనమ్ కు శిక్ష పడేలా కృషి చేస్తామని గోవింద్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News