Thursday, March 28, 2024

యాదగిరిగుట్టలో ఐస్‌క్రీమ్ కంపెనీపై ఎస్‌వోటీ పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: యాదగిరిగుట్టలో నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఐస్‌క్రీమ్ కంపెనీపై శుక్రవారం ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. పట్టణంలోని బీసీకాలనీ సమీపంలో కొనసాగుతున్న ఐస్‌క్రీమ్ కంపెనీలో అపరిశుభ్రమైన, ప్రమాదకరంగా ఐస్‌క్రీమ్ తయారీ చేస్తున్నట్టు సమాచారంతో భువనగిరి ఎస్‌వోటీ బృందం దాడిచేసి సోదాలు జరిపినట్టు తెలిపారు.

సోదాలో ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ, అపరిశభ్రమైన వాతావరణంలో లేబులింగ్ లేనటువంటి ఐస్‌క్రీమ్‌ను తయారుచేసినట్టు గుర్తించామని అధికారులు తెలిపారు. 1504 ఎల్ ఐస్‌క్రీమ్ కవర్లు, చాకోబార్ ఐస్‌క్రీమ్ కవర్లు, 60 రుచికరమైన పికుల్ఫీ కవర్లు, 8 వేల ఐస్‌క్రీమ్ కప్పులు, రెండు సీఈఎస్ ఐస్‌క్రీమ్ ఫ్లేవర్ లిక్విడ్ బాటిళ్లు, ఒక ఐఐఎఫ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లిక్విడ్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఐస్‌క్రీమ్ కంపెనీ నిర్వాహకుడు పాపట్ల కృష్ణపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌వోటీ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News