Saturday, May 31, 2025

సిక్సు కొట్టాడని ఆగ్రహం.. మ్యాచ్ మధ్యలో ఫైట్..

- Advertisement -
- Advertisement -

ఢాకా: ఏ ఆటలో అయినా క్రీడాస్పూర్తి ఉండాలి. ప్రత్యర్థి ఆటగాళ్లను గౌరవించే మనస్తత్వం ఉండాలి. ఇవి లేకపోతే.. ఆ ఆటకు అర్థమే ఉండదు. ముఖ్యంగా క్రికెట్ అంటేనే జెంటిల్‌మెన్స్ గేమ్ అంటారు. ఈ ఆటలో దూషణలు చేసుకోవడమే తప్పు.. అలాంటిది ఏకంగా ఫైటింగ్ చేసుకుంటే అది చాలా దారుణం. అలాంటి ఘటనే ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా (South Africa) – బంగ్లాదేశ్ (Bangladesh) వర్థమాన జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌలర్, బ్యాట్స్‌మెన్ ఒకరిపై మరొకరు దాడికి దిగారు.

దక్షిణాఫ్రికా (South Africa) బౌలర్ షెపో ఎంటులి బౌలింగ్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) బ్యాటర్ రిపాన్ మోండాల్ సిక్సు కొట్టాడు. అతన్ని తోటి బ్యాట్స్‌మెన్ మెహదీ హసన్ అభినందించాడు. అయితే అంపైర్ వైపు వస్తున్న సమయంలో రిపాన్‌పై ఎంటులి దాడికి దిగారు. అతడిని ఛాతిపై కొట్టాడు. రిపాన్ కూడా ఎదురుదాడికి దిగాడు. కొందరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా రిపాన్‌ను దూషించారు. తోటి ఆటగాళ్లు, అంపైర్లు ఇద్దరిని విడదీయడంతో గొడవ సద్ధుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News