Sunday, April 28, 2024

హస్తానికి అధికారం అందించిన దక్షిణ తెలంగాణ

- Advertisement -
- Advertisement -
నల్లగొండ, పాలమూరు, ఖమ్మం జిల్లాల్లో సగం సీట్లు గెలుపు
గ్రేటర్ జిల్లాలో బిఆర్‌ఎస్ హవా

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో హస్తం హవా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 64 సీట్లు రాగా,  బిఆర్‌ఎస్‌కు 39 సీట్లు, బిజెపికి 8, ఎంఐఎం-7, సిపిఐ-1 స్థానంలో గెలుపొందాయి. ఉమ్మడి జిల్లాల వారీగా ఆయా పార్టీలు గెలిచిన సీట్లు వివరాలు వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలకు కాంగ్రెస్-10, బిఆర్‌ఎస్- 2, ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలకు కాంగ్రెస్ -8, సిపిఐ- 01, బిఆర్‌ఎస్-01, నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు కాంగ్రెస్-11, బిఆర్‌ఎస్-01 స్థానంలో విజయం సాధించింది. మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలకు కాంగ్రెస్ 12, బిఆర్‌ఎస్ -2, మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలకు కాంగ్రెస్-03, బిఆర్‌ఎస్ -07, రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలకు కాంగ్రెస్- 04, బిఆర్‌ఎస్-10, హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు గాను బిఆర్‌ఎస్ -07, ఎంఐఎం-7, బిజెపి 0-1, కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలకు కాంగ్రెస్ -08, బిఆర్‌ఎస్- 05, నిజామాబాద్ జిల్లాలో 9 నియోజవకర్గాలకు కాంగ్రెస్- 04, బిఆర్‌ఎస్- 02, బిజెపి 0-3, ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలకు కాంగ్రెస్ -04, బిఆర్‌ఎస్- 02, బిజెపి -04 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News